చెన్నై : తమ స్వంత గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 19వ సీజన్ లో ప్రారంభంలో ఆశించిన రాణించలేక పోయిన సీఎస్కే ఉన్నట్టుండి జూలు విదిల్చింది. ఓ వైపు బ్యాటింగ్ , మరో వైపు బౌలింగ్ లో దుమ్ము రేపుతూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ లేక పోయినా ఆ జట్టులో సంజు శాంసన్ , కార్తీక్ శర్మ, ఆయుష్ మాత్రే ఇలా యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్నీత 20 ఓవర్లలో ఏకంగా 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 204 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కళ్లు చెదిరే షాట్స్ తో విరుచుకుపడ్డాడు. తను కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు నమోదు చేశాడు . గతంలో ఐపీఎల్ లో నమోదైన జైశ్వాల్ రికార్డును సమం చేశాడు. తను కేవలం 23 బంతులు ఎదుర్కొని 65 రన్స్ చేశాడు. దీంతో చెన్నై విజయం లో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది. ఈ 65 పరుగులలో 2 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి . ఆఖరులో శివమ్ దూబే విక్టరీకి చేరువ చేశాడు. జట్టు 19.2 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది. జయ కేతనం ఎగుర వేసింది. దీంతో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసుపై ఆశలు పెంచేలా చేసింది. అంతకు ముందు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 48 రన్స్ చేశాడు.
.