శ్రేయ‌స్ అయ్య‌ర్ అయ్యారే సెంచ‌రీ భ‌ళారే

ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్

ల‌క్నో : ఐపీఎల్ 19 మెగా టోర్నీ నుంచి ఆఖ‌రి మ్యాచ్ లో నువ్వా నేనా తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో అద్బుతంగా ఆడింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ పై పూర్తి ప‌ట్టు సాధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ల‌క్నో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఇక మెగా టోర్నీలో తొలి సెష‌న్ లో వ‌రుస‌గా 7 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. కానీ సెకండాఫ్ లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో నిరాశ ప‌రిచింది. కానీ ఆఖ‌రు మ్యాచ్ లో మాత్రం అద‌ర‌గొట్టింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. ఇక చివ‌రి మ్యాచ్ లోనైనా గెలుపొంది ప‌రువు కాపాడాల‌ని అనుకున్న ల‌క్నో జ‌ట్టుకు నిరాశే మిగిలింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది.

ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే అయ్య‌ర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను 51 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 101 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. జ‌ట్టు విజ‌యంలో ముఖ్య పాత్ర పోషిచాడు. త‌న‌కు తోడుగ‌గా ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ సైతం దుమ్ము రేపాడు. కెప్టెన్ కు తోడుగా బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ఈ విజ‌యంతో 15 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్, కోల్ క‌తా జ‌ట్ల మ‌ధ్య ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ రెండు జ‌ట్లు ఓట‌మి పాలు కావాల్సి ఉంటుంది. ల‌క్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. 196 ప‌రుగులు చేసింది. సిమ్ర‌న్ 69 ప‌రుగులు చేశాడు. ల‌క్నో జ‌ట్టులో జోష్ ఇంగ్లిష్ 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్ల‌తో 72 ర‌న్స్ చేస్తే ఆయుష్ బ‌దోని 18 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేశాడు.

Leave A Reply

Your Email Id will not be published!