అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు . మాజీ సీఎం జగన్ రెడ్డిని, ఆయన స్థాపించిన వైసీపీని ఏకి పారేశారు. సంజీవని ప్రజా వేదిక సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందించారు సీఎం. వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అకృత్యాలను వివరించారు. ఇదే గొడ్డలి పార్టీ నైజం అంటూ విమర్శలు చేశారు. జగన్ అరాచకాలకు సంబంధించి 11 పాయింట్లు వెల్లడించారు సభా సాక్షిగా సీఎం. వైసీపీ చేసిన నిర్వాకాలను, అరాచక ఘటనలను వివరించారు. అందుకే మీది గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదు అని ప్రకటించారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు.
వివేకా హత్య, నాటకాలు – అంతిమ లబ్దిదారు ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు. కోడికత్తి డ్రామా… గులకరాయి డ్రామా ప్రజలను మోసం చేసే ఎత్తుగడ అని ఎద్దేవా చేశారు.దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ- నిందితుడికి వైసీపీ అండదండలు నిజం కాదా అని ప్రశ్నించారు. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ పై దాడి చేయడం, వేధించి ప్రాణాలు తీసిన వైసీపీ ప్రభుత్వం అరాచకాన్ని ప్రజలు స్వయంగా చూశారన్నారు. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు, ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం చేసింది నిజం కాదా అని నిలదీశారు సీఎం .హిందూ దేవుళ్లపై అకృత్యాలు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు… తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలు చూశారన్నారు.
పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు వేసింది నిజం కాదా అని భగ్గుమన్నారు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసేంత రక్త దాహంతో వైసీపీ ఉన్నది కాదా అన్నారు. గంజాయి బ్యాచ్ లకు ప్రోత్సాహం…రప్పా రప్పా రంకెలు…జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు చేసింది వాస్తవం కాదా . కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను తొక్కించారు…కడపలో పెద్ద దస్తగిరిని చంపేసింది నిజం కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.