చెన్నై : గత ఏడాది లో కంటే ఈసారి 2026లో జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ప్రధానంగా ఇప్పటి దాకా కీ రోల్ పోషిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రాను రాను జట్టుకు దూరం కావడం. దీంతో జట్టును గాడిలో పెట్టేందుకు సీఎస్కే యాజమాన్యం సంచలన నిర్ణయాలు తీసుకుంది. భారీ ధరలకు కొనుగోలు చేసింది పలు ఆటగాళ్లను. ప్రధానంగా తమ జట్టులో ముఖ్య భూమిక పోషించిన రవీంద్ర జడేజా, సామ్ కరన్ లను వదులుకుంది. కేవలం ఒకే ఒక్క ఆటగాడి కోసం. ఆ ప్లేయర్ ఎవరో కాదు 2026లో ఐసీసీ వరల్డ్ కప్ ను సాధించిన భారత్ లో కీ రోల్ పోషించిన కేరళ స్టార్ క్రికటర్ సంజు శాంసన్.
తను కూడా రెండు సెంచరీలతో ఆకట్టుకున్నా, అసలమైన సమయంలో చేతులెత్తేయడం ఒకింత ఇబ్బందికి గురి చేసింది. ఈ తరుణంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు గాను మరో కీలక ఆటగాడిని తీసుకోవాలని యాజమాన్యయం ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా వరల్డ్ కప్ లను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులో తీసుకకునేందుకు రెడీ అయ్యిందని, దీనికి కూడా తను కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో అటు శాంసన్ , ఇటు పాండ్యాలతో సీఎస్కే టీం మరింత బలోపేతం కానుంది.
