వైభ‌వ్ సూర్య‌వంశీ సూప‌ర్ : అమితాబ్ బ‌చ్చ‌న్

అద్భుతంగా ఆడుతున్నాడంటూ ప్ర‌శంస‌లు

ముంబై : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌సులోనే సంచ‌ల‌నాల‌కు తెర లేపాడు బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య‌వంశీ. రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 19 సీజ‌న్ లో అత్యంత విలువైన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. అంతే కాదు ఈ టోర్నీలో ఏకంగా త‌ను ఒక్క‌డే 76 సిక్సులు బాదాడు. ఇది వ‌ర‌ల్డ్ రికార్డ్. ఈ సంద‌ర్బంగా త‌న అద్బుత‌మైన ఆట తీరును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు అమితాబ్ బ‌చ్చ‌న్. ఈ వండ‌ర్ కిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా వైభ‌వ్ త‌న 16 ఇన్నింగ్స్‌లలో 48.50 సగటుతో, 237.50 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ప్రపంచ క్రికెట్‌లో మునుపెన్నడూ చూడని నిలకడ, విధ్వంసకరత్వం కలగలిసిన ప్రదర్శనను సూర్యవంశీ అందించగలిగాడు .2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసినప్పటి నుండి తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న, బీహార్‌కు చెందిన సూర్యవంశీ, ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్ల కోసం వెటరన్ క్రిస్ గేల్ నెలకొల్పిన ఐపీఎల్ రికార్డుతో సహా ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా స్టేడియం అంతటా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తుంది. జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో, అతను ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు.

అద్భుతమైన వేగంతో పరుగులు సాధిస్తూ జట్టు ఆశలను తన భుజాలపై మోసాడు. అతను జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లను కూడా వదల్లేదు. నిస్సందేహంగా, ఈ పదిహేనేళ్ల అద్భుత ప్రతిభావంతుడు ఒక విధ్వంసకర పరుగుల యంత్రంగా మారి, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!