హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు . దీనిని సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు డీజీపీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యేను ఎట్టకేలకు తెలంగాణ భవన్ లో దాక్కున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే భారీ బందోబస్తు మధ్య లాయర్ల సమక్షంలో బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి న్యాయమూర్తి ఇంటి ముందు ప్రవేశ పెట్టారు. జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తనను జైలుకు తరలించాలని ఆదేశించారు ఖాకీలను.
ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాల్క సుమన్ ను భారీ భద్రత మధ్య నగరంలోని చంచల్ గూడ జైలుకు తరలించారు. తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. సింగరేణి అధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు నగరంలోని నాంపల్లి పోలీసులు. బాల్క సుమన్ పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS,4 PDPPA యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ, సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్క సుమన్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా అరెస్ట్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయలేదన్నాడు. కావాలని తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే సర్కార్ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు.
