హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జైపూర్ పవర్ ప్లాంట్ స్కాం బయట పెట్టారు. జైపూర్ ప్లాంట్ DPRకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదని , పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేదు అయినా టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రశ్నించారు. హరీశ్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. టెండర్లు పిలిచి వాళ్ళు అనుకున్న వాళ్లకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఏడాదిన్నర అయినా డీపీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ లేదన్నారు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లేనే లేదని పేర్కొన్నారు. ఆలస్యం కారణంగా సింగరేణి పై ఏడాదికి రూ.750 కోట్లు, రోజుకు రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ పనులు పర్యవేక్షించేందుకు ఒక ఆంధ్ర అతనిని జైపూర్ లో నియమించారని పేర్కొన్నారు హరీశ్ రావు. ఎన్టీపీసీ అతి తక్కువ ధరకు ఇచ్చే విద్యుత్తు ఉండగా ఎక్కడో జైపూర్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు చేశారని ఆరోపించారు. తనకు 24% వాటా చేస్తున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వం పాకిస్తాన్ బార్డర్ జైసల్మేర్లో 1400 MW సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారని అన్నారు తన్నీరు హరీశ్ రావు. సింగరేణి వాడు పోయి పాకిస్తాన్ బార్డర్లో సోలార్ ప్లాంట్ పెట్టాలని అనడం దారుణమన్నారు .. సింగరేణి పని ఏంది, అక్కడ ఎక్కడో సోలార్ ప్లాంట్ పెట్టుడు ఎందుకు, అసలు ఎవరి కోసం పెట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.