అమెరికా : ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ కి కోలుకోలేని షాక్ తగిలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తను హాజరయ్యారు. తన ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు పాలస్తీనా దేశానికి చెందిన విద్యార్థులు . ఈ ఘటన తో సుందర్ పిచాయ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇజ్రాయెల్‌తో గూగుల్‌కు ఉన్న సంబంధాలను నిరసిస్తూ ‘స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనాస (ఎస్‌జీపీ) యూనివర్సిటీ విభాగం , ఇతర నిరసన బృందాలు గత నెలలోనే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించాయి. స్టాన్ ఫోర్డ్ లో పూర్వ విద్యార్థిగా ఉన్నారు సుందర్ పిచాయ్. తను ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జయోనిజం-వ్యతిరేక విద్యార్థులు నిరసనగా సభ నుండి బయటకు వెళ్లిపోయారు ఇజ్రాయెల్‌తో గూగుల్‌కు ఉన్న సంబంధాలే ఈ నిరసనకు కారణమని సదరు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. పాలస్తీనియన్ల హత్యలు, నిఘా ద్వారా ఎలా ధనవంతులు కావాలో మాకు చెప్పడానికి మరొక టెక్ బిలియనీర్ అవసరం లేదు అని స్టాన్ఫోర్డ్ పేర్కొన్నట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ వెల్లడించింది. యుద్ధం ద్వారా లాభపడటాన్ని వ్యతిరేకించండి. గూగుల్ సీఈఓకు ఇక్కడ స్వాగతం లేదని తెలియ జేయండి అని ఆ బృందం పేర్కొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలలో, డజన్ల కొద్దీ విద్యార్థులు పాలస్తీనా జెండాలను పట్టుకుని, పాలస్తీనాకు విముక్తి కావాలంటూ నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయారు.
కాగా సుందర్ పిచాయ్ 1995లో స్టాన్ఫోర్డ్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందాడు. ప్రస్తుతం గూగుల్ , ఆల్ఫాబెట్ సీఈఓగా వ్యవహరిస్తున్న పిచాయ్, స్టాన్ఫోర్డ్ 135వ స్నాతకోత్సవంలో 2026 బ్యాచ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఒక వ్యక్తి జీవితాన్ని, వృత్తిని తీర్చిదిద్దే కీలక ఘట్టాల గురించి పిచాయ్ ప్రస్తావించారు.