సికింద్రాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఆగస్టు 2న నిర్వహింనున్నారు .జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారర చుడతారు. ఆగస్టు 2న అమ్మ వారికి బోనాలు సమర్పస్తారు. న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివరాలను ప్రజా ప్రతినిధులకు అందజేశారు ఆలయ కార్య నిర్వహణ అధికారి మనోహర్ రెడ్డి. దీంతో సరిగ్గా నెలరోజుల్లో నగరంలో మొదలు కానున్నాయి బోనాల జాతరలు. ఈ బోనాలకు హైదరాబాద్ నగరం కేరాఫ్ గా మారి పోయింది.
ఇదిలా ఉండగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాలు ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ పండుగలో మొదటి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మ వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అనాది నుంచి. తొలి గురువారం లేదా ఆదివారం నాడు గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి పూజ చేసి, మొదటి బోనాన్ని సమర్పిస్తారువందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు అమ్మవారికి మొట్ట మొదటి బోనాలు సమర్పించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సర్కార్ సైతం బోనాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
