హైకోర్టు ఆదేశాలతో పాత కార్డులకే రెన్యూవల్

అయోమయంలో అక్రెడిటేషన్ల ప్రక్రియ

హైద‌రాబాద్ : హైకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది జ‌ర్న‌లిస్టుల‌కు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు 2026-28 సంవత్సరాలకు గానూ జారీ చేసిన కొత్త అక్రెడిటేషన్ కార్డులకు ఇవ్వాల్సిన బస్ పాస్ లకు హైకోర్టు బ్రేక్ వేసింది. అక్రెడిటేషన్ల జీవో ఎంఎస్ 252, జీవో ఆర్టీ నెంబర్ 229 లను సవాల్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలుతో పాటు మరో ఇద్దరు రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ల పై వాద‌న‌లు జ‌రిగాయి. సోమయ్య వేసిన పిటీషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ ను, వివిధ జిల్లాల డీపీఆర్వోలను ప్రతివాదులుగా చేర్చారు.

అక్రెడిటేషన్ జీవో పై దాఖలైన నాలుగు పిటీషన్ల పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఒకేసారి విచారణ జరిపింది.జీవో 252 ప్రకారం రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లోకి నాలుగు జర్నలిస్టు సంఘాలను తీసుకోవాల్సి ఉండగా కేవలం మూడు సంఘాలను మాత్రమే తీసుకొని కమిటీల కూర్పుతో అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ మామిడి సోమయ్య తరపు న్యాయవాది వాదించారు. నాలుగు సంఘాలతో కాకుండా కేవలం మూడు సంఘాలతోనే జీవో ను అమలు చేయడం నేరమని, ఒక ఐఏఎస్ అధికారి ఇంతటి తప్పు చేయడం నేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందుకే పాత వాటిని మాత్ర‌మే రెన్యూవ‌ల్ చేయాల‌ని స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!