కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలభిషేకం నిషేధం

గజమాలలు వేయడాన్ని నిషేధిస్తూ ఆదేశం

న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, సీఎం ఎ. రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఏఐసీసీ. ఈ మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా ఉన్న మీనాక్షి న‌ట‌రాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి పార్టీకి సంబంధించి జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో గ‌జ‌మాల‌లు వేయ‌డం, పాలాభిషేకం, జ‌లాభిషేకం నిర్వ‌హించం నిషేధిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు పార్టీ త‌ర‌పున టీపీసీసీ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరిన టీవీకే స‌ర్కార్ ఇలాంటి నిర్ణ‌యమే తీసుకుంది. ఆ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్య‌క్షుడు టి. కుమార్ రావు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాలభిషేకం లేదా జలాభిషేకం నిర్వహించ కూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆహార వృథాకు దారితీసే ఇటువంటి పద్ధతులకు బదులుగా, అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని పంపిణీ చేయాలని సూచించారు. అలాగే జేసీబీలు, బుల్‌డోజర్‌ల వంటి భారీ యంత్రాలను ఉపయోగించి నాయకులకు గజమాలలు వేయడాన్ని కూడా నిషేధించారు; నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, జ‌లాభిషేకం, గ‌జ‌మాల‌లు వేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఆయ‌న వ‌చ్చాక కాంగ్రెస్ పార్టీలో ఇది ఎక్కువైంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తంగా మీనాక్షి న‌ట‌రాజ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా సంతోషం వ్య‌క్తం అవుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!