హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన యువ నటులలో రామ్ పోతినేని ఒకడు. తాజాగా తను ఓ మూవీకి సంతకం చేశాడు. ఇందులో ప్రతి నాయకుడు (విలన్ ) పాత్ర ముఖ్యమని, అందు కోసం బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ హీరోలను విలన్ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ప్రముఖ బాలీవుడ్ కు చెందిన నటుడు జాకీ ష్రాఫ్ ను విలన్ గా కన్ ఫర్మ్ చేసినట్లు తెలిసింది. అయితే చిత్ర బృందం మాత్రం ఇంకా తనను ఎంపిక చేసిన విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా జాకీ ష్రాఫ్ రాక ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, కీలకమైన విలన్ పాత్ర కోసం జాకీ ష్రాఫ్‌ను పరిశీలిస్తున్నారని, చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఈ మధ్యన సినీ పరిశ్రమలో ట్రెండ్ మారుతోంది. బాలీవుడ్ కు చెందిన పలువురు పేరు పొందిన నటులు తెలుగు సినిమాలలో ప్రతి నాయకులుగా దర్శనం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జాకీ ఫ్రాష్ కూడా విలన్ పాత్ర కోసం చూస్తున్నట్లు తెలిసింది. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నటులు శక్తివంతమైన ప్రతినాయక పాత్రలు పోషించే ధోరణి కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. సంజయ్ దత్ (డబుల్ ఇస్మార్ట్), సైఫ్ అలీ ఖాన్ (దేవర), బాబీ డియోల్ (హరి హర వీర మల్లు) , నవాజుద్దీన్ సిద్ధిఖీ (సైంధవ్) తర్వాత, ఇప్పుడు సీనియర్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రామ్ పోతినేని ప్రతిష్టాత్మక చిత్రం RAPO23లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించేందుకు చర్చలు జరుపుతుండడం విశేషం.