న్యూఢిల్లీ : నీట్ లీక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులు, విద్యార్థుల పట్ల పోలీసులు అనుసరించిన విధానం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్. తను తీవ్రంగా స్పందించాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ఆందోళన తెలియ చేయడం, నిరసన ప్రదర్శన చేపట్టడం ప్రతి ఒక్కరి హక్కు అని గుర్తించక పోవడం బాధ కలిగించిందని పేర్కొన్నాడు. తను ఇటీవలే పాటలు పాడనంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆ వెంటనే విద్యార్థుల ఆందోళనకు బేషరతుగా మద్దతు పలకడం చర్చకు దారితీసేలా చేసింది. సింగర్ ఆర్జిత్ సింగ్ తో పాటు ప్రముఖ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ ల భార్యలు సంజనా గణేశన్ , దేవిషా శెట్టిలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల పట్ల దాడులు దారుణమని పేర్కొన్నారు. ఆ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
మరో వైపు నిరసనకారులపై బలప్రయోగం చేయడాన్ని సింగర్ ఆర్జిత్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలు పోస్టులు పంచుకున్నారు. వారు చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా పోలీసులు జరిపిన అణచివేతను ఆయన విమర్శించారు. నీట్ పేపర్ లీక్, పరీక్షా విధానంలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు పార్లమెంటుకు పాదయాత్ర చేయగా, వారిని టియర్‌గ్యాస్, లాఠీలతో వెనక్కి నెట్టేశారు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా బాలీవుడ్ తారలు ఆన్‌లైన్‌లో ఏకమయ్యారు. నిరసనకారులపై బలప్రయోగం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు విద్యార్థులను కొడుతున్నారు మీకు సిగ్గు లేదా!!??” అని ఆయన రాశారు. హలో నేతా, మంత్రి. ఏం జరుగుతోంది.. మిమ్మల్ని మీరు దేవుళ్ళని అనుకోవడం మొదలుపెట్టారా ఏంటి? అని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్జిత్ సింగ్.
ఇక పోలీసుల చర్యను విమర్శించిన పలువురు ప్రముఖులలో సింగ్ కూడా ఒకరు. షబానా అజ్మీ , ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు విద్యార్థి మార్చ్‌లో పాల్గొనగా, అనురాగ్ కశ్యప్, జీనత్ అమన్, కిరణ్ రావు, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి , దిల్జిత్ దోసాంజ్‌లతో సహా పలువురు సోషల్ మీడియాలో తమ మద్దతు ప్రకటించారు.
