అమెరికా : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. తమ సంస్థ పరిధిలోని యూట్యూబ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరగడంతో భారీ ఎత్తున కోట్లాది మంది యూట్యూబ్ వేదికగా ఈ మ్యాచ్ ను వీక్షించారని వెల్లడించారు పిచాయ్. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా వీక్షించిన ఫీఫా ప్రపంచ కప్ ఇదేనని గూగుల్ సీఈఓ అన్నారు. ఈ టోర్నమెంట్ యూట్యూబ్‌లో అపూర్వమైన ఆదరణను సృష్టించిందని, ప్రపంచ కప్‌కు సంబంధించిన కంటెంట్ జీవితకాల వీక్షణలను 200 బిలియన్లకు పైగా పెంచిందని పిచాయ్ అన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో స్పెయిన్, అర్జెంటీనాల మధ్య జరిగిన ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జట్టు విజయం సాధించిన తర్వాత స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ విజేతల ట్రోఫీని అందుకుంది.
టోర్నమెంట్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 1.7 బిలియన్లకు పైగా ప్రజలు యూట్యూబ్‌లో ఫీఫా ప్రపంచ కప్‌కు సంబంధించిన వీడియోలను చూశారని తెలిపారు సిఇఓ పిచాయ్. తద్వారా ఇది ఆ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా వీక్షించిన ప్రపంచ కప్‌గా నిలిచిందని వెల్లడించారు. దీని గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ టోర్నమెంట్ యూట్యూబ్‌లో అపూర్వమైన ఆదరణను సృష్టించిందని, ప్రపంచ కప్‌కు సంబంధించిన కంటెంట్ జీవితకాల వీక్షణలను 200 బిలియన్లకు పైగా పెంచిందని పిచాయ్ అన్నారు. సీఈవో నీల్ మోహన్ మాట్లాడుతూ యూట్యూబ్ చరిత్రలో ఇది ఓ అరుదైన రికార్డ్ అని పేర్కొన్నారు. పోటీ అంతటా ఫుట్‌బాల్ అభిమానులను ఆకట్టు కోవడంలో క్రియేటర్లు పోషించిన పాత్రను హైలైట్ చేశారు.
