ఐఏఎస్ అధికారి ఎం.టి. కృష్ణబాబు రిటైర్

విశేష సేవ‌లు అందించిన అధికారిగా గుర్తింపు

అమ‌రావ‌తి : సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఎంటీ కృష్ణ‌బాబు శ‌నివారం రిటైర్ అయ్యారు. విశేష సేవ‌లు అందించ‌డంలో గుర్తింపు పొందారు. సమర్థవంతమైన పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ పరిపాలన, రవాణా, ఆరోగ్య రంగాల్లో విశేష సేవలు అందించడంలో కీల‌క పాత్ర పోషించారు. జూలై 15, 1966లో పుట్టారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు. వివిధ కీలక పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాసేవలో విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్ర‌కాశం , క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేశారు. విశాఖ జేసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ గా , హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై , సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప‌ని చేశారు. విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ గా , ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ ఎండీగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు ఎంటీ కృష్ణ బాబు.

జల వనరుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో ముఖ్య బాధ్యతలు చేప‌ట్టారు. ఏపీ స‌ర్కార్ లో కీల‌క‌మైన ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు . పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు జిల్లా కలెక్టర్‌గా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సమర్థ నాయకత్వం ప్ర‌ద‌ర్శించారు. రవాణా, పోర్టులు, విద్యుత్, నీటి సరఫరా వంటి కీలక రంగాల్లో పరిపాలనా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు. ఆరోగ్య రంగంలో విధానాల అమలుకు నాయకత్వం వహించారు ఎంటీ కృష్ణ బాబు. ప్రశాంతమైన పని తీరుకు , సమర్థవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలనకు పేరుగాంచారు. ప్రజా పరిపాలనలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ఐఏఎస్ అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

Leave A Reply

Your Email Id will not be published!