తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
అక్టోబర్ 6న రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు
చెన్నై : తమిళనాడులో సీఎం విజయ్ టీవీకే సర్కార్ కొలువు తీరి మూడు నెలలు పూర్తయింది. పాలనా పరంగా మంచి మార్కులు కొట్టేసినా ఇప్పుడు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు టీవీకే బాస్ . కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెల 6వ తేదీన రెండు శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. దీంతో ఎన్నికల వేడి రాఉకుంది. అధికారంలో ఉన్న టీవీకేతో ఆటు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. అన్నాడీఎంకే కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే లో చేరారు. దీంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు మధురాంతకం (ఎస్సీ) , ధరాపురం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రకటించడంతో చర్చలు మొదలయ్యాయి.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి వెంటనే స్పందించారు. ఆ రెండు స్థానాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అలాగే ఆ
అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రజాదరణ కలిగిన పార్టీ నేతలను బరిలోకి దింపి ఆ స్థానాలను నిలబెట్టుకోవడానికి అన్నాడీఎంకే తీవ్రంగా ప్రయత్నించనుంది. ఇప్పటికే మధురాంతకం మాజీ ఎమ్మెల్యే కనిగ సంపత్ అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. ధరాపురంలో కూడా పోటీకి మరికొందరు స్థానిక నాయకులు ముందుకు వస్తారని, తద్వారా ఆ స్థానాలను అన్నాడీఎంకే నిలబెట్టు కుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే డీఎంకే మాత్రం ఈ ఉప ఎన్నికలను బహిష్కరించాలని యోచిస్తోంది.