80 ఏళ్లయినా ఇంకా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాం
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ : దేశానికి స్వేచ్ఛ లభించి 80 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఇంకా మనుషుల మధ్య అంతరాలు తొలగి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వేదికగా ‘ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ , ఎస్టీ ఎంప్లాయిస్’ (టీయూఎఫ్) ,సకల జన సేవ సంస్థాన్ వ్యవస్థాపక అధ్యక్షులు జి.ఎస్. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజంలో నెలకొన్న సామాజిక పరిస్థితులు, రాజకీయాల సరళిపై పలు సూచనలను చేశారు. దేశంలో కులం ప్రమేయం లేకుండా రాజకీయాలు నడిచే పరిస్థితి లేదన్నారు. విచిత్రమేమిటంటే మన దేశంలో ఏ ఒక్క కులమూ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా లేదని పేర్కొన్నారు ఎంపీ. దేశంలోని అన్ని కులాలు ఏదో ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉన్నాయని చెప్పారు.
మనకు కావాల్సింది కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాదు, మనిషిని మనిషిగా గౌరవించే మానవత్వం కావాలన్నారు.. రాజ్యాంగ స్ఫూర్తిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని, దాన్ని సమగ్రంగా అమలు చేసే నిజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు ఈటల రాజేందర్. దేశానికి స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాలలోపే రిజర్వేషన్ల అవసరం తొలగి పోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారు. కానీ, నేడు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ‘వర్గీకరణ’ కోరుకునే దుస్థితిలో ఉండటం పురోగమనమా, తిరోగమనమా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా కోల్పోయిన పాలకులు.. కులతత్వం ), మతతత్వం ప్రాంతీయతత్వం వంటి అస్త్రాలను రాజకీయ లబ్ది కోసం ముందుకు తెస్తారని అర్ధ శతాబ్దం క్రితమే ఒక చారిత్రక పత్రం స్పష్టం చేసిందన్నారు. పాలకులు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం ఉచితాలు ఇవ్వరని, కేవలం అధికారం కోసం జరిగే అధికార పోరాటంలో భాగంగానే ఇటువంటి తాయిలాలు ప్రకటిస్తారని ఆనాడే స్పష్టమైందన్నారు రాజేందర్. సమాజంలో మనిషిని మనిషిగా చూసేందుకు అడ్డుగా నిలిచే ఈ సామాజిక రుగ్మతలు ఏదో ఒక రోజు కచ్చితంగా అంతమవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి
