Samantha : స‌మంత ‘టీ ష‌ర్ట్’ హ‌ల్ చ‌ల్ 

డ్రెస్ సెన్స్ లో వెరీ డిఫ‌రెంట్ 

Samantha : పుష్ప మూవీతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది న‌టి స‌మంత‌(Samantha). అంత‌కు ముందు అక్కినేని నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టంచి మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసింది.

త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా వెల్ల‌డించే ఈ న‌టి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు, త‌మిళ సినిమాల‌తో పాటు హిందీ వెబ్ సీరీస్ లో కూడా న‌టిస్తోంది. తాజాగా హాలీవుడ్ కు సంబంధించిన సినిమా కూడా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా త‌న అభిప్రాయాల‌తో పాటు త‌న‌కు సంబంధించి ఫోటోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది సోష‌ల్ మీడియాలో. తాజాగా స‌మంత (Samantha)ధ‌రించిన టీ ష‌ర్ట్ ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ అవుతోంది.

దానిపై ఉన్న క్యాప్ష‌న్ డిఫ‌రెంట్ గా ఉండ‌డం ఇందుకు మ‌రో కార‌ణం. ఇక ఫిట్ నెస్ , మోటివేష‌న‌ల్ పోస్టుల‌తో జ‌నాన్ని మెస్మ‌రైజ్ చేస్తోంది స‌మంత‌. త‌న‌కు త‌న మీద న‌మ్మ‌కం ఉండ‌డంతో తాను ఎవ‌రినీ ప‌ట్టించుకోన‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

విమ‌ర్శ‌ల‌ను దూరంగా పెడ‌తాన‌ని, ప్ర‌శాంతంగా ఉండేందుకే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తాన‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ముంబై లోని ఓ సెలూన్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో కెమెరాలు క్లిక్కు మ‌నిపించాయి.

ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వైట్ టీ ష‌ర్ట్ గురించి ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆర్ 13 వైట్ టీ ష‌ర్ట్  దాని ధ‌ర వేల‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా. వైట్ టీ ష‌ర్ట్ తో పాటు బ్లాక్ జీన్స్ , వైట్ స్పోర్ట్స్ షూస్ పెట్టుకుని మెస్మ‌రైజ్ చేస్తోంది.

Also Read : రాధే శ్యామ్ మూవీ డేట్ ఫిక్స్

Leave A Reply

Your Email Id will not be published!