Wasim Jaffer : పంజాబ్ కింగ్స్ కు వ‌సీం జాఫ‌ర్ షాక్

ఇక సేవ‌లు అందించ‌లేన‌ని ప్ర‌క‌ట‌న

Wasim Jaffer : సుదీర్ఘ కాలం పాటు పంజాబ్ కింగ్స్ కు సేవ‌లు అందించిన వ‌సీం జాఫ‌ర్(Wasim Jaffer) ఉన్న‌ట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2022 మెగా వేలానికి స‌న్న‌ద్దం అవుతున్న త‌రుణంలో తాను ఇక సేవ‌లు అందించ‌లేనంటూ ప్ర‌క‌టించాడు.

ఇది ఒక ర‌కంగా పంజాబ్ కింగ్స్ కు గ‌ట్టి దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఆ జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్న స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ సైతం త‌ప్పుకున్నాడు.

అత‌డిని భారీ ధ‌ర‌కు పెట్టి కొనుగోలు చేసింది కొత్త ఫ్రాంచైజీగా రంగంలోకి దిగిన ల‌క్నో. ఈ త‌రుణంలో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ గా ఇప్ప‌టి దాకా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన వ‌సీం జాఫ‌ర్ గుడ్ బై చెపుతున్న‌ట్లు డిక్లేర్ చేశాడు.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు. విచిత్రం ఏమిటంటే ఏ దిల్ హై ముష్కిల్ సినిమా నుంచి ఓ మీమ్ ను షేర్ చేశాడు. ఇక ఫ్రాంచైజీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.

కాగా ఇన్ని రోజుల పాటు క‌లిసి ప‌ని చేసినందుకు, త‌న‌ను భ‌రించినందుకు థ్యాంక్స్ అంటూ తెలిపడం విశేషం. త్వ‌ర‌లో జ‌రబోయే ఐపీఎల్ సీజ‌న్ లో అద్భుతంగా రాణించాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండ‌గా 2019 నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. ఆ జ‌ట్టులో కుర్రాళ్ల‌ను బాగా ఆడేలా చేశాడు. ఉన్న‌ట్టుండి త‌ప్పుకున్న వసీం జాఫ‌ర్ (Wasim Jaffer) ఏ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

త్వ‌ర‌లోనే ఆ విష‌యం కూడా బ‌య‌ట ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అహ్మ‌దాబాద్, ల‌క్నో ఫ్రాంచైజీలు ఇత‌ర జ‌ట్ల తో పాటు ఆట‌గాళ్లు, కోచ్ లు , నిపుణుల‌పై క‌న్నేసి ఉంచాయి.

Also Read : పుష్ప మేనియా కోహ్లీ వారెవా

Leave A Reply

Your Email Id will not be published!