Samantha : సినీ రంగంలో నటీ నటులు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఇంకేదానికీ ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది.
ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా ప్రధానంగా నటీమణులకు కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఇక పుష్ప మూవీతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఆమె పూర్తి ఫిట్ నెస్ తో ఉంటోంది. దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. తన రోజూ వారీ కార్యక్రమంలో జిమ్ లో గడుపుతోంది. తరచూ తాను జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది.
దీంతో ఆమెకు అభిమానులు రెట్టింపు అయ్యారు. అక్కినేని నాగార్జున కోడలిగా ఉన్న సమంత ఉన్నట్టుండి అక్కినేని నాగ చైతన్యకు గుడ్ బై చెప్పేసింది. విడాకులు తీసుకున్నాక నటి కెరీర్ పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది.
కానీ అదేమి చిత్రమో కానీ సమంత కెరీర్ మాత్రం ఊహించని రీతిలో కంటే ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. సమంత(Samantha) సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారి పోయింది.
ఇక జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ గురించి ఎలా నేర్పిస్తాడనే దానిపై చెప్పడం ఆమె స్పెషాలిటీ. ఇదిలా ఉండగా జిమ్ ట్రైనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సామ్ పై. ఒక వేళ అథ్లెట్ అయి ఉండి ఉంటే ఆమె విరాట్ కోహ్లీ సరసన ఉండేదన్నాడు.
Also Read : డిస్ట్రిబ్యూటర్లకు 20% వెనక్కిచ్చిన భీమ్లా