Boris Johnson : స‌చిన్..అమితాబ్ బ‌చ్చ‌న్ లా అనిపించింది

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ కామెంట్

Boris Johnson : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏకంగా భార‌త క్రికెట్ కు చెందిన మాజీ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ , బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం పీఎం చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బోరిస్ జాన్స‌న్ (Boris Johnson)భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే ఆయ‌న గుజ‌రాత్ లో ప‌ర్య‌టించారు. అక్క‌డ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అడుగ‌డుగునా హోర్డింగ్ లు ద‌ర్శ‌నం ఇచ్చాయి.

అక్క‌డి నుంచి నేరుగా మ‌హాత్మా గాంధీ స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. జేసీబీ నిర్మాణ ప‌రిశ్రమ‌ను చూశారు. అనంత‌రం భార‌తీయ ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం గౌత‌మ్ అదానీ ఇచ్చిన ప్ర‌త్యేక విందుకు హాజ‌ర‌య్యారు.

అక్క‌డి నుంచి నేరుగా దేశంలో పేరొందిన అక్ష‌ర‌ధామ్ ఆల‌యాన్ని సంద‌ర్శించి పూజ‌లు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు సంప్ర‌దాయ రీతిలో స్వాగ‌తం ల‌భించ‌డంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యారు.

అనంత‌రం ఢిల్లీకి వ‌చ్చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ మీడియాతో మాట్లాడారు. మోదీ త‌న‌కు ఖాస్ దోస్త్ అని చెప్పారు.

ప‌నిలో ప‌నిగా స‌చిన్ టెండూల్క‌ర్ , అమితాబ్ ల‌ను ప్ర‌స్తావించారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికినందుకు ప్ర‌ధాని మోదీకి, దేశ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

నా రాక‌తో స‌చిన్ టెండూల్క‌ర్ లా అనిపించింద‌ని, హోర్డింగ్ లు చూసిన‌ప్పుడు అమితాబ్ లా భావించాన‌ని చెప్పారు బోరిస్ జాన్స‌న్ .

Also Read : జ‌మ్మూలో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

Leave A Reply

Your Email Id will not be published!