UK MP Neil Parish : ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చాక టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన పోర్న్ (బూతు) ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
భారత్ లో ప్రధానంగా కర్నాటకలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ మంత్రి రాజీనామా చేశారు. ఇంకొకరు తప్పుకున్నారు. ఈ తరుణంలో యూకేకు చెందిన ఎంపీ నీల్ పారిష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
పార్లమెంట్ ప్రమాణాల కమిషనర్ కు స్వయంగా నివేదించిన తర్వాత కన్సర్టేవిట్ లు నీల్ పారిష్(UK MP Neil Parish )ను సస్పెండ్ చేశారు. అయితే మూమెంట్ ఆఫ్ మ్యాడ్ నెస్ లో పార్లమెంట్ లో పోర్న్ చూశానని బ్రిటన్ ఎంపీ తెలిపారు.
మీ మనసులో ఏం జరుగుతోందని అడిగినప్పుడు ఎంపీ దానిన పిచ్చి క్షణంగా పేర్కొనడం విశేషం. తాను అశ్లీల చిత్రాలు చూసిన మాట వాస్తవమేనని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని, తాను తప్పు ఒప్పుకుంటున్నట్లు చెప్పారు నీల్ పారిష్.
పోర్న్ ను రెండు సార్లు చూశానని ఒప్పుకున్నాడు. చూసిన మాట వాస్తవమేనని, కానీ తాను పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని అన్నారు.
చివరకు రాజీనామా చేయడం విశేషం. చివరకు నేను ఇలా చేయడం తప్పే. నా కుటుంబానికి, నా నియోజకవర్గానికి తప్పు చేసినట్లు ఫీలవుతున్నాను. అందుకే తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
ఇదిలా ఉండగా ఈ వారం ప్రారంభంలో ఒక మహిళా మంత్రి కామన్స్ ఛాంబర్ లో తన పక్కన కూర్చొని ఒక సహోద్యోగి అశ్లీల చిత్రాలు చూడటం కమిటీ విచారణలో బయట పడింది.
Also Read : కాబూల్ లో పేలుడు 66 మంది దుర్మరణం