Yogi : వాళ్లిద్దరూ రాజకీయాల్లో ఆరి తేరిన నాయకులు. ఒకరు పరిచయం అక్కర్లేని నాయకురాలు మమతా బెనర్జీ. మరొకరు ఉత్తర ప్రదేశ్ చరిత్రలో రెండోసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ టార్చ్ బేరర్ యోగి ఆదిత్యానాథ్(Yogi ).
ఇద్దరూ భిన్నమైన భావజాలం నుంచి వచ్చిన వారు. ఇద్దరిదీ ఒకే దారి. తాము అనుకున్నది చేసి తీరాలన్న కసి పట్టుదల. వీరిద్దరిదీ దారులు వేరైనా నడిచి వచ్చింది మాత్రం కింద నుంచే. నిత్యం పోరాటమే. ప్రతినిత్యం యుద్దమే.
యోగి ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి రాజకీయ నేతగా, యోగిగా ప్రసిద్దుడు. కానీ మమతా బెనర్జీ ప్రజల నుంచి వచ్చిన అరుదైన లీడర్. వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్ లో సీఎంగా కొలువు తీరారు. తానేమిటో రుచి చూపించారు.
మోదీ త్రయానికి చెక్ పెట్టారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ అన్న పేరుంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నా వ్యక్తిగత విమర్శలకు మాత్రం పోలేదు.
కానీ తనకంటే అనుభవం రీత్యా, పెద్దదైన సీఎం మమతా బెనర్జీ వద్దకు వెళ్లి వినమ్రంగా పలకరించారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi ).
రాజకీయంగా విభేదాలు ఉన్నా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ వారిద్దరూ ఆప్యాయంగా పలకరించు కోవడం ఢిల్లీలో జరిగిన సీఎం, సీజేల సంయుక్త సమావేశంలో చోటు చేసుకుంది.
దీంతో వీరిద్దరి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇద్దరూ సమాజం కోసం, ప్రజా సేవ కోసం పెళ్లి చేసుకోక పోవడం వారి నిబద్దతకు నిదర్శనం.
ఏది ఏమైనా రాజకీయాల్లో తల పండిన వీరిద్దరూ కలుసు కోవడం, పలకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : పెండింగ్ లో 40 మిలియన్ల కేసులు – సీజేఐ