Mahela Jayawardene : జ‌య‌వ‌ర్ద‌నే డ్రీమ్ టీమ్ లో బుమ్రా

టీ20 జ‌ట్టుపై హెడ్ కోచ్ అంచ‌నా

Mahela Jayawardene : ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే (Mahela Jayawardene)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న టీ20 కి సంబంధించిన త‌న క‌ల‌ల జ‌ట్టును ప్ర‌క‌టించాడు. ఇందులో స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రాకు చోటు క‌ల్పించాడు.

త‌న డ్రీమ్ టీమ్ లో జ‌స్ ప్రీత్ బుమ్రా తో పాటు ర‌షీద్ ఖాన్ , షాహీన్ ఆఫ్రిది, జోస్ బ‌ట్ల‌ర్ , మ‌హ్మ‌ద్ రిజ్వాన్ కూడా ఎంపిక చేశాడు. ఇదిలా ఉండ‌గా జ‌స్ ప్రీత్ బుమ్రా ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్నాడు.

టీ20 11 టీమ్ లో కేవ‌లం ఐదుగురిని ఎంపిక చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా జ‌య‌వ‌ర్ద‌నే (Mahela Jayawardene)మాట్లాడాడు. ఒక జ‌ట్టుకు ఎల్ల‌ప్పుడూ వికెట్ టేకింగ్ ఎంపిక‌లు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నాడు.

ఇన్నింగ్స్ ను ముగించేందుకు బుమ్రా కంటే మెరుగైన ఆట‌గాడు లేడ‌ని చెప్పాడు మ‌హేళ‌. జ‌స్ ప్రీత్ బుమ్రా అంటే నాకు ఇష్టం.

ఇన్నింగ్స్ ప‌రంగా ఎలాంటి స‌మ‌యంలోనైనా ఎక్క‌డైనా ఏ ఫార్మాట్ లోనైనా అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌లిగే నైపుణ్యం బుమ్రాకు ఉంద‌ని కితాబు ఇచ్చాడు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క్రికెట్ లో స్టార్ పేస‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా కంటే గొప్ప బౌల‌ర్ ఇంకెవ‌రూ లేర‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే. ఇదిలా ఉండ‌గా బుమ్రా ఇప్ప‌టి వ‌ర‌కు టీ20 ప‌రంగా 57 మ్యాచ్ ల్లో 19.89 స‌గ‌టుతో 67 వికెట్లు తీశాడు.

ఇక ఐపీఎల్ ప‌రంగా చూస్తే ఆరెంజ్ క్యాప్ రేసులో ఇంగ్లండ్ స్టార్ హిట్ట‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జోస్ బ‌ట్ల‌ర్ ఉన్నాడు. ఇప్ప‌టి దాకా 592 ర‌న్స్ తో టాప్ లో ఉన్నాడు.

తాను బ‌ట్ల‌ర్ తో క‌లిసి బ్యాటింగ్ చేయాల‌ని క‌ల‌గా ఉంద‌ని చెప్పాడు జ‌య‌వ‌ర్ద‌నే. షాహీన్ అఫ్రిది అద్భుతంగా స్పెల్ వేస్తున్నాడ‌ని కితాబు ఇచ్చాడు.

Also Read : రాజ‌స్థాన్ సేమ్ సీన్ కోల్ క‌తా సెన్షేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!