Anchor Suma : తెలుగు వినోద రంగంలో ఆమె టాప్ పొజిషన్ లో ఉంది. యాంకర్ గా ఆమె లేకుండా ఏ ప్రోగ్రాం జరగని పరిస్థితి నెలకొంది. అంతలా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది సుమ.
ఆమె భర్త నటుడు రాజీవ్ కనకాల. ఈ మధ్య కాలంలో సుమ, రాజీవ్ ఇద్దరూ విడి పోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో గత కొన్నేళ్లుగా యాంకర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్న సుమ ఉన్నట్టుండి తెర మీద నటిగా ప్రత్యక్షం అయ్యింది. జయమ్మ పంచాయతీలో నటించింది సుమ.
విజయ కలివారపు దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు.
ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమాకు సంబంధంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా సుమ ( Anchor Suma)తన అభిప్రాయాలను పంచుకుంటోంది.
తాను నటించిన విధానం, సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై క్లారిటీ ఇచ్చేస్తోంది. ఇదే సమయంలో సుమ ఎక్కడికి వెళ్లినా మీరు రాజీవ్ కనకాల ఇద్దరూ విడి పోయారట కదా ఇది నిజమేనా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది.
దీనికి ధీటుగా సమాధానం ఇచ్చింది సుమ.( Anchor Suma) ప్రతి సారి తామిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు.
మా మధ్య బంధం 23 ఏళ్లయింది. చాలా బలంగా, భద్రంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని చెప్పింది.
Also Read : ఎఫ్-3 మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్