Deepika Padukone : శ్రీవారి సేవలో ‘దీపికా..ప్రకాష్’ పదుకొనె
తండ్రి పుట్టిన రోజు సందర్భంగా
Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే శుక్రవారం తిరుమలను దర్శించుకున్నారు. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనె(Deepika Padukone) పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగలను దర్శించుకున్నారు.
ఇవాళ్టితో ప్రకాశ్ పదుకొనెకు 67 ఏళ్లు. ఆలయ పూజారులు వారికి ఆశీస్సులు అందజేశారు. తెల్లటి కుర్తా, సల్వార్ కమీజ్ లో దీపికా ఉండగా తండ్రి పట్టు వస్త్రాలు ధరించి సంప్రదాయ బద్దంగా పూజలు చేశారు.
ఇక దీపికా పదుకొనేతో పాటు సోదరి అనీషా పదుకొనె కూడా ఉన్నారు తండ్రి, సోదరితో పాటు. ఇదిలా ఉండగా దీపికా పదుకొనె(Deepika Padukone) తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గతంలో తిరుపతి ఆలయాన్ని సందర్శించారు.
ఆనాడు ఆమె ఎరుపు రంగు చీరను ధరించింది. లేత గోధుమ రంగు కుర్తా, పైజామాలో భర్త రణవీర్ సింగ్ తో కలిసి వచ్చింది. వారి పేరెంట్స్ , తోబుట్టువులు కూడా ఆలయానికి వారి పర్యటనలో కలిసి వచ్చారు.
కాగా దీపికా పదుకొనే ఇటీవలే కేన్స్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని భారత్ కు వచ్చారు. అక్కడ ఆమెకు అరుదైన గౌరవం లభించింది.
దీపికా పదుకొనేను ప్యానల్ మెంబర్ గా ప్రమోట్ చేసింది అవార్డుల కమిటీ. ప్రియాంక చోప్రాతో పాటు పూజా హెగ్డే, తదితర ప్రముఖ నటీ నటులు హాజరయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ మూవీలో నటించనుంది.
Also Read : శ్రీవారి భక్తులకు ఈవో శుభవార్త