Kashmiri Youtuber Arrest : కాశ్మీరీ యూట్యూబర్ ఫైసల్ అరెస్ట్
నూపుర్ శర్మపై విద్వేషపూర్తి వీడియో
Kashmiri Youtuber Arrest : విద్వేష పూరితంగా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్న కాశ్మీర్ కు చిందిన యూట్యూబర్(Kashmiri Youtuber Arrest) ఫైసల్ వాసిని అరెస్ట్ చేశారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఈ యూట్యూబర్ మరింత విద్వేషాన్ని రెచ్చ గొట్టేలా ఆమెపై నిప్పులు చెరుగుతూ వీడియోలు చేశాడని పోలీసులు తెలిపారు.
దీంతో ఇతర మతాలకు చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బ తీయాలనే ఇలా చేశాడని పేర్కొన్నారు. ప్రధానంగా ఆమెను టార్గెట్ చేశాడని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ కాశ్మీరీ యూట్యూబర్(Kashmiri Youtuber Arrest) సస్పెన్షన్ కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి దిష్టిబొమ్మను నరికి చంపిన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు కాశ్మీర్ కు చెందిన ఫైసల్ వాసి అని గుర్తించింది.
ఈ వీడియో ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని వైరల్ గా మారిందని పోలీసులు చెప్పారు. యూట్యూబ్ లో ఒక నేరారోపణ వీడియోను అప్ లోడ్ చేశాడు.
ఇది ప్రజల మధ్య చిచ్చుపెట్టేదిగా, మత విద్వేషాలను మరింత రెచ్చగొట్టేలా ఉందని పేర్కొన్నారు. పూర్తిగా ఈ వీడియో భయాందోళనకు గురి చేసిందని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ కాశ్మీరీ యూట్యూబర్ తాను చేసిన వీడియోను శనివారం తెల్లవారుజామున తొలగించాడు. ఎవరి మనసులైనా నొప్పిస్తే తనను క్షమించమని కోరాడు.
ఈ మేరకు పోస్ట్ కూడా చేశారు. శుక్రవారం నేను నూపర్ శర్మ గురించి ఒక వీడియో చేశాను. ఇది భారత దేశం అంతటా వైరల్ అయ్యింది. నేను అమాయకుడిని కావాలని చేసింది కాదని పేర్కొన్నాడు తాజా వీడియోలో. తన వీడియోను డిలీట్ చేసినట్లు పేర్కొన్నాడు.
Also Read : తస్లీమా నస్రీన్ షాకింగ్ కామెంట్స్