Talapathy Vijay : విద్యార్థులకు ఆసరా చదువుకు భరోసా
నటుడు తళపతి విజయ్ సేవలకు ఫిదా
Talapathy Vijay : తమిళనాడు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా పేరు పొందారు తళపతి విజయ్. తన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎక్కువగా మాట్లాడడు. కానీ గుప్త దానాలు చేయడంలో ముందుంటారు. సమాజం పట్ల, సామాన్యుల పట్ల కరుణ కలిగి ఉంటారు. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు తన వంతు సాయం చేస్తున్నారు. ఇదే విషయాన్ని విజయ్ అనుచరులు గొప్పగా పేర్కొన్నారు.
విద్యా రంగానికి సంబంధించి నటుడు విజయ్ చేస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఆశా జనకంగా ఉన్నాయని ప్రశంసలతో ముంచెత్తారు. విప్లవకారుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , పితామహుడు పెరియార్, మహా నేత కామరాజ్ వంటి సామాజిక నాయకులంటే ఎనలేని అభిమానం తళపతి విజయ్(Talapathy Vijay) కు. ఒక ఉన్నత స్థాయిలో నటుడిగా ఉన్నప్పటికీ చాలా సాధారణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం ఆయనకు మాత్రమే చెల్లింది.
ఇదిలా ఉండగా తళపతి విజయ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఆయన రాజకీయ పార్టీని పెడతారని ప్రచారం జరిగింది. కానీ దాని నుండి విరమించుకున్నారు. తన పేరుతో తండ్రి పార్టీని నమోదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. చివరకు కోర్టు దాకా వెళ్లింది. కానీ ఆ వెంటనే విరమించుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయ్ ఉన్నట్టుండి డీఎంకేకు మద్దతు ఇచ్చారు. అది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అంతే కాదు విజయ్ జీఎస్టీ మీద ప్రశ్నలు సంధించారు. నిలదీశారు. దీని వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదన్నారు.
Also Read : Ajinkya Rahane : రోహిత్ కు షాక్ రహానేకు ఛాన్స్ ?