బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ కామెంట్స్
సినీ నటులను ట్రోల్ చేస్తే బాధితురాలికి న్యాయం జరగదు
హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్. తాను బీజేపీకి మద్దతిస్తాను కానీ.. అత్యాచారాలకు పాల్పడే వారికి, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను యాంకర్ గా ఉన్నా, బీజేపీని ప్రేమిస్తున్నా బాధితురాలికి అన్యాయం చేసిన బండి భగీరథ్ ను సపోర్ట్ చేసే ప్రసక్తి లేదన్నారు. రష్మీ గౌతమ్. ఈ విషయంలో మైనార్టీ తీరని బాలికకు మద్దతు ఇస్తానని ప్రరకటించాడు.
సమస్యల పట్ల తాను కేవలం సానుభూతి మాత్రమే చూపగలనని, వాటితో పోరాడే శక్తి తనకు లేదని ఆ యాంకర్ వెల్లడించారు . తనను ట్యాగ్ చేయడం, దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండ బద్దలు కొట్టారు. తనను లక్ష్యంగా చేసుకోకుండా, తనను ట్యాగ్ చేయడానికి బదులుగా, న్యాయం కోసం ప్రభుత్వ అధికారులను, న్యాయ వ్యవస్థను ట్యాగ్ చేయాలని ఆమె సూచించారు. కేవలం ఈ ఘటన గురించి పోస్ట్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదని, తనను ట్యాగ్ చేయవద్దని రష్మీ విజ్ఞప్తి చేశారు . నటీనటులను ట్యాగ్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందని.. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనియాంకర్ అంటున్నారు. ఇదిలా ఉండగా రష్మీ బీజేపీ మద్దతుదారు కావడంతో.. బండీ భగీరథ్ కేసుపై ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా పై విధంగా స్పందించారు.
