ఢిల్లీ క్యాపిటల్స్ ఝలక్ పంజాబ్ కింగ్స్ కు షాక్
దంచి కొట్టిన కెప్టెన్ అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్
ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఏ జట్టు చేరుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ , పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు దోబూచు లాడుతున్నాయి. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు సైతం ప్లే ఆఫ్స్ కు వెళుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక కీలకమైన లీగ్ మ్యాచ్ కు వేదికైంది పంజాబ్ లోని ధర్మశాల. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులారా కోల్పోయింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
ఇక అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం వర్కవుట్ అయ్యింది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్ ఉన్నట్టుండి పరాజయాలను మూటగట్టుకుంది. ఇక ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసుపై ఆశలు పెట్టుకుంది. ఆ జట్టు ఈ విజయంతో 10 పాయింట్లు సాధించింది. చెన్నై తర్వాతి స్థానంలో నిలిచింది. మ్యాచ్ విషయానిక వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్ ముందు ఉంచింది పంజాబ్. టాప్ ఆర్డర్ విఫలం అయినా కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతా యుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను 30 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. మరో వైపు కెప్టెన్ కు తోడయ్యాడు డేవిడ్ మిల్లర్ 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్సర్లతో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.