చెన్నై : ప్రముఖ గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా తమిళనాట సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి సినీ, రాజకీయ వర్గాలలో. విజయ్ ఓ పరాన్న జీవి అని పేర్కొన్నారు. నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను నా అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం విజయ్ తన తల్లిదండ్రులు, భార్యకు దూరంగా ఒంటరిగా ఉన్నారని, ఇలాంటి సమయాల్లో ‘పరాన్నజీవుల’ వంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు అతనికి భారంగా మారుతున్నారని వ్యాఖ్యానిస్తూ ఆమె పరోక్షంగా త్రిషను లక్ష్యంగా చేసుకున్నారు.
త్రిష కృష్ణన్‌ను బహిరంగంగా విమర్శించడం ద్వారా, గాయని సుచిత్ర విజయ్, త్రిష కృష్ణన్‌ల చుట్టూ ఉన్న చర్చను మళ్లీ రాజేశారు. తన చుట్టూ ప్రజల నిశిత పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో, విజయ్ వ్యక్తిగత జీవితం , రాజకీయ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా తీర్పుపై దీని ప్రభావం పడనివ్వను. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం. నేను ఎవరి పక్షం వహించకుండా నిజాయితీగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను అని పేర్కొనడం సంచలనంగా మారింది. విజయవంతమైన వ్యక్తులు ఒంటరి అయినప్పుడు వారి జీవితాల్లోకి పరాన్నజీవులు ప్రవేశిస్తాయి. అతను ఒంటరివాడే కానీ ఇప్పటివరకు ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఈ పరిస్థితుల్లోనే అతను రాజకీయాల్లోకి వచ్చాడు. నిజం చెప్పాలంటే అతనికి తన తండ్రి చంద్రశేఖర్ అవసరం. ఆయనే విజయ్‌ను రాజకీయ జలాల్లో నడిపించగలరు. లేకపోతే అతను రాజకీయాల్లో ఏమీ సాధించలేడు. ఎందుకంటే రాజకీయాల్లో అతనికి ఏవైనా మంచి జరగాలంటే, దానికి అతని తండ్రి మద్దతే కారణం అని గాయని సుచిత్ర అన్నారు.
