AP CM YS Jagan : 99 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశా
స్పష్టం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
AP CM YS Jagan : గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశానని ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy). శుక్రవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాటలు చెప్పనని చేసి చూపిస్తానని చెప్పారు. పని చేసి ఓట్లు అడుగుతానని, మాయ మాటలు చెప్పడం తనకు రాదన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అధికారం కోసం ఎంతటి స్థాయికైనా దిగజారే నాయకులు మాట్లాడే మాటలకు విలువ ఉండదన్నారు ఏపీ సీఎం.
గతంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను మోసం చేసిందన్నారు. కానీ తాను వారి బాధలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారనని ఇది తనకు ఉద్యోగుల పట్ల ఉన్న చిత్త శుద్ది ఏమిటో తెలుస్తుందన్నారు. ఇవాళ అన్ని వర్గాల వారిని అభివృద్ది పథంలోకి తీసుకు వచ్చేందుకు శాయ శక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం టీడీపికి చెల్లిందన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ను పట్టించు కోవడం మానేశారన్నారు. వాళ్లు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, తిరిగి తనను మరోసారి సీఎంగా దీవించడం ఖాయమని జోష్యం చెప్పారు జగన్ రెడ్డి. ఏపీ రాష్ట్ర చరిత్రలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టానని ప్రకటించారు సీఎం. రాబోయే కాలం కూడా మాదేనని పేర్కొన్నారు.
Also Read : Open AI CEO PM Modi : మోదీని కలిసిన ఏఐ సిఇఓ
