సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలి

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేరాల ద్వారా బాధితుల సొమ్మును రాబట్టేందుకు గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని పోలీసు అధికారులు, బ్యాంకింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. సచివాలయంలో సైబర్ నేరాల్లో తక్షణ స్పందన- ఏపీలో నియంత్రణా వ్యవస్థలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఇతరుల బ్యాంక్ ఖాతాలను వినియోగించకుండా చేపట్టే చర్యలు, గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఏపీలో సైబర్ నేరాలు, ఆర్ధిక నేరాలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ అంశంపై రిజర్వు బ్యాంకును సంప్రదించాలని సీఎం సూచించారు. ఆర్ధిక, సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే అంశంపై సీఎం కొన్ని సూచనలు చేశారు. ఆథార్ ఆథంటికేషన్, కేవైసీ లాంటివి లేకుండా షెల్ కంపెనీలను కొందరు ప్రారంభిస్తున్నారని , ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని చెప్పారు సీఎం. ఇలాంటి ఘటనలపై అధ్యయనం చేయాలన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్, ఆర్ధిక శాఖలు సమన్వయంతో ఆన్ లైన్ ఆర్ధిక మోసాల విషయంలో ఓ నియామవళిని సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఫ్లాగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సైబర్, ఆర్ధిక నేరాల్లో ఖాతాదారుల ప్రయోజనాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!