Justice Madan B Lokur : ఢిల్లీ ఆర్డినెన్స్ అప్ర‌జాస్వామికం

జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్ కామెంట్స్

Justice Madan B Lokur : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోట్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్(Justice Madan B Lokur) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌ను, ప్ర‌త్యేకించి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌ధానంగా ఢిల్లీ ఆప్ స‌ర్కార్ పై పెత్త‌నం చెలాయించేందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ ను తీసుకు వ‌చ్చింది. పూర్తి అధికారాల‌న్నీ కేంద్రానికి వ‌ర్తింప చేసేలా తీసుకు రావ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతోంది ఆప్. ఇప్ప‌టికే ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ(Delhi) సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఆ మేర‌కు దానిని చ‌ట్టంగా అమ‌లు కాకుండా పార్ల‌మెంట్ లో బిల్లు వీగి పోయేలా చేసేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను క‌లుసుకున్నారు. ప‌నిలో ప‌నిగా పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ తో క‌లిసి త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌రాఠా మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎట్టి ప‌రిస్థితుల్లో బిల్లు రాకుండా చూడాల‌ని వారిని అభ్య‌ర్థించారు.

ఎందుకంటే బిల్లు చ‌ట్టంగా మారాలంటే పార్ల‌మెంట్ లోని ఉభ‌య స‌భ‌లు లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లలో మూడింట రెండో వంతు మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సి ఉంటుంది. లోక్ స‌భ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు బ‌లం ఉన్నా రాజ్య‌స‌లో లేదు. దీంతో చ‌ట్టం కాకుండా చేసేలా పావులు క‌దుపుతున్నారు. ఈ సంద‌ర్బంగా జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఢిల్లీ(Delhi) ఆర్డినెన్స్ అనేది ఢిల్లీ ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చెలాయించేందుకు ఉద్దేశించినది. దీనిని కావాల‌ని కేంద్రం తీసుకు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : MP Vijay Sai Reddy : జ‌గ‌న్ సంక‌ల్పం అభివృద్దికి సోపానం

 

Leave A Reply

Your Email Id will not be published!