L Sivaramakrishnan : షాతో శివ‌రామ‌కృష్ణ‌న్ భేటీ

అత‌డో ఉక్కు మ‌నిషంటూ కితాబు

L Sivaramakrishnan : మాజీ భార‌త క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ స్పోర్ట్స్ అండ్ స్కిల్స్ డెవ‌ల‌ప్ మెంట్ బీజేపీ త‌మిళ‌నాడు చీఫ్ ల‌క్ష్మ‌ణ్ శివ‌రామ‌కృష్ణ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు ల‌క్ష్మ‌ణ్ శివ రామ కృష్ణ‌న్(L Sivaramakrishnan ).

అమిత్ షాను క‌ల‌వ‌డం అద్భుతంగా ఉంద‌న్నారు మాజీ క్రికెట‌ర్. అత్యంత దూర దృష్టి క‌లిగిన నాయ‌కుడు అంటూ కితాబు ఇచ్చారు. అంతే కాదు ఉక్కు సంక‌ల్పం క‌లిగిన వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

దేశం ప‌ట్ల ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై అమిత్ చంద్ర షాకు ముందు చూపు ఉంద‌న్నారు. ఈ విష‌యం తామిద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న చ‌ర్చ‌ల్లో వెల్ల‌డైంద‌న్నారు లక్ష్మ‌ణ్ శివ‌రామ‌కృష్ణ‌న్. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం బీజేపీ పాగా వేయాల‌ని చూస్తోంది. అక్క‌డ గ‌త కొన్నేళ్లుగా రెండు పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే మ‌ధ్య పోటీ ఉండేది.

ఎప్పుడైతే అమిత్ చంద్ర షా ఊహించ‌ని రీతిలో మాజీ ఎస్పీ కే. అన్నామ‌లైని బీజేపీ చీఫ్ గా ప్ర‌క‌టించాడో ఆనాటి నుంచి బీజేపీ దూసుకు పోతోంది. గ‌తంలో జరిగిన పంచాయ‌తీ, ప‌ట్ట‌ణ ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయ‌మైన సీట్ల‌ను సాధించింది.

Also Read : Morari Bapu Comment : ‘బాపు’ స‌త్యం ‘ప్రేమ’ శాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!