తాడేపల్లి గూడెం : ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వైసీపీ శ్రేణులు, నేతలు సిద్దం కావాలని స్పష్టం చేశారు మాజీ సీఎం , వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారని అయినా బెదరవద్దన్నారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలన్నారు పిలుపునిచ్చారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని, అందుకే తప్పకుండా గెలుస్తాం అన్నారు.
రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారయ్యాన్నారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడ్డారన్నారు. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు . అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ వారు కుమ్మక్కై పని చేస్తున్నారని, ఇదెక్కడా లేదన్నారు జగన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడి నిర్వాకం కారణంగా లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదన్నారు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు
