ఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మే

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా చీఫ్ ట్రంప్

అమెరికా : ఇరాన్ త‌మ దారికి రావాల‌ని, దాడుల‌ను ఆపాల‌ని లేక పోతే నాశ‌నం కాక త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. హోర్ముజ్‌ను తెరవండి లేదా విద్యుత్ ప్లాంట్లపై దాడులు ఎదుర్కోండి అని పేర్కొన్నారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో జలసంధిని సురక్షితం చేయాలని స్వదేశంలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏకంగా ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా ఆ దేశానికి 24 గంట‌ల డెడ్ లైన్ విధించారు. ఇదిలా ఉండ‌గా ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలో నిన్న రాత్రి దక్షిణ ఇజ్రాయెల్‌లోని రెండు ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడుల్లో భవనాలు ధ్వంసమవ్వగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.

మరోవైపు 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాల‌ని లేక పోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను అమెరికా స‌ర్వ నాశ‌నం చేస్తుంద‌ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నాలుగో వారం ప్రారంభంలో ఈ యుద్ధం ఒక ప్రమాదకరమైన కొత్త దిశగా పయనిస్తోందని ఈ పరిణామాలు సంకేతాలు ఇచ్చాయి. లేకపోతే మరో విడత దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు. పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచంలోని మిగిలిన సముద్రాలతో కలిపే హోర్ముజ్ జలసంధి, ప్రపంచ చమురు ప్రవాహానికి ఒక కీలకమైన మార్గంగా ఉంది. వాణిజ్య నౌకలపై దాడులు చేస్తామంటూ ఇరాన్ తీవ్ర హెచ్చ‌రిక చేసింది ఇరాన్.

Leave A Reply

Your Email Id will not be published!