KCR EX CM : సీఎం కేసీఆర్ కు ఆప‌రేష‌న్

ఆయ‌న ఆరోగ్యం ప‌దిలం

KCR EX CM : హైద‌రాబాద్ – త‌న ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ప‌డి పోయారు మాజీ సీఎం కేసీఆర్. దీంతో ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ లోని య‌శోద ఆస్ప‌త్రిలో చేర్చారు. వైద్యాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేసీఆర్ కు ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఈ ప‌రీక్ష‌ల్లో తుంటి మార్పిడి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేలింద‌ని పేర్కొన్నారు. దీంతో విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు, అభిమానులు యాశోద ఆస్ప‌త్రికి బారులు తీరారు.

KCR EX CM Health Updates

ఇవాళ త‌న మామ‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం మాజీ మంత్రి హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఎవ‌రూ ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసీఆర్(KCR) అభిమానులు ఆరోగ్యం బాగుండాల‌ని త‌మ త‌మ ప్రాంతాల్లో ప్రార్థ‌న‌లు చేయాల‌ని కోరారు.

ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల నిమిత్తం ఆప‌రేష‌న్ థియేట‌ర్ కు తీసుకు వెళ్లారు. ప్ర‌స్తుతం సోమాజిగూడ య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి, త‌న‌యుడు కేటీఆర్ , రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్ రావు ఉన్నారు. ఆయ‌నకు ద‌గ్గ‌రుండి స‌ప‌ర్య‌లు చేస్తున్నారు.

Also Read : VC Sajjanar MD : మ‌హిళ‌ల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

Leave A Reply

Your Email Id will not be published!