VC Sajjanar MD : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
ప్రకటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
VC Sajjanar MD : హైదరాబాద్ – తెలంగాణ ఆర్టీసీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే ఛాన్స్ ఇస్తామని ప్రకటించారు నూతన సీఎం రేవంత్ రెడ్డి.
VC Sajjanar MD Comment
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఖుష్ కబర్ ఇచ్చారు.
ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే భాగ్యాన్ని ప్రసాదించనున్నట్లు ప్రకటించారు.
నూతన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్(VC Sajjanar MD). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు సిటీ ఎక్స్ ప్రెస్ బస్సులో జర్నీ చేయొచ్చని చెప్పారు.
కులం, మతం లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు ఏదో ఒక ఐడీ కార్డును చూపించి జర్నీ చేయాలని , ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని కోరారు. ఎన్ని కిలోమీటర్లు అయినా ఎక్కొచ్చు దిగొచ్చని స్పష్టం చేశారు.
Also Read : AP CM YS Jagan : వరద ప్రాంతాలలో జగన్ పర్యటన
