PM Modi Students : మోదీ ముచ్చట విద్యార్థులు ఫిదా
భూపాల్ లో వందే భారత్ ప్రోగ్రాం
PM Modi Students : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు పిల్లలన్నా, చిన్నారులంటే, ప్రత్యేకించి విద్యార్థులంటే వల్లమాలిన అభిమానం, అంతకు మించిన ప్రేమ కూడా. ఆయన ప్రధాన మంత్రిగా కొలువు తీరిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్. ఇందులో స్పూర్తి దాయకమైన కథలు, వ్యక్తులు, విజేతల గురించి ప్రస్తావిస్తారు. వారి గురించి జాతికి తెలియ పరుస్తారు. ఇదో అద్భుతైమన ప్రోగ్రాం. ఇలాంటి కార్యక్రమంలో ప్రపంచంలో ఏ ప్రధాన మంత్రి నిర్వహించడం లేదు.
ఉన్న కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికి తెలియదని అనడంలో సందేహం లేదు. ఇక మోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ స్పెషల్ గా పిల్లలు ఉండాల్సిందే. ఆయన వాళ్లతో సంభాషిస్తారు. వారిని ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నం చేస్తారు. అంతే కాదు వారిని కుశల ప్రశ్నలు వేస్తారు. వారి నుంచి సమాదానాలు రాబడతారు. ఇదో అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు భావి భారత పౌరుల్లో ఉంటుందని నమ్ముతారు ప్రధాన మంత్రి.
తాజాగా భోపాల్ లో వందే భారత్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వందే భారత్ ట్రైన్ లో విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆ మధుర క్షణాలను పంచుకున్నారు పీఎం.
Also Read : CM KCR Gift : సామాన్యుడి కానుక కేసీఆర్ ఫిదా
