సీఎం రేవంత్ రెడ్డితో 20 ఏళ్ల బంధం

వెల్ల‌డించిన నిర్మాత దిల్ రాజు

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు అలియాస్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఓ పాడ్ కాస్ట్ తో కీల‌క అంశాల గురించి ప్ర‌స్తావించారు. ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డితో త‌న‌కు దీర్ఘకాలంగా స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయాలు అంటే ప‌డ‌వ‌ని, కేవ‌లం సినిమాలు నిర్మించ‌డం, త‌న వ్యాపారాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాన‌ని చెప్పారు దిల్ రాజు. చాలా మంది అనుకున్న‌ట్లు తాను కోరితే ఈ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్నారు.

త‌న‌కు సీఎం రేవంత్ కు మ‌ధ్య 20 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మాది విడ‌దీయ‌లేని బంధం అని పేర్కొన్నారు వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి అలియాస్ దిల్ రాజు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే సీఎం రేవంత్ రెడ్డి నాకు స్వ‌యంగా ఫోన్ చేశారు. నువ్వు వెంట‌నే రావాలని, కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని తీసుకోవాల‌ని కోరార‌ని అన్నారు. అందుకే తాను కాద‌న‌లేక పోయాన‌ని పేర్కొన్నారు. ఆయన పట్ల ఉన్న గౌరవంతో నేను ఆ పదవిని స్వీకరించానే త‌ప్పా కావాల‌ని కోరుకున్న‌ది కాద‌న్నారు. టాలీవుడ్ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా దిల్ రాజు అలియాస్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌లో.

Leave A Reply

Your Email Id will not be published!