Revanth Reddy : పోచారం..హరీష్ పై రేవంత్ గుస్సా
పదవుల కోసం రాజకీయాలు అంటే ఎలా
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సోయి తప్పి, గతి తప్పి, మతి తప్పి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సంచలన కామెంట్స్ చేశారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవులలో ఉన్న చైర్మన్, స్పీకర్ రాజకీయాలు ఎలా మాట్లాడుతారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
వెంటనే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ పదవులను రద్దు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కోరారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ధోరణితో, వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆ విషయం కూడా తెలుసు కోకుండా నోరు జారడం ఎంతవరకు సబబు అని నిలదీశారు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy).
చైర్మన్, స్పీకర్ ల పదవులను అడ్డం పెట్టుకుని కొడుకులు , కుటుంబీకులు దందాలకు పాల్పడుతున్నారని , అవినీతి, అక్రమాలకు అడ్డాగా చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. అధికారం ఉంది కదా అని విపక్షాలపై నోరు పారేసుకోవడం ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలని అన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Jupally Krishna Rao : ప్రియాంక సభ వాయిదా
