Satya Nadella Shahrukh : క్రికెట్ లో స‌త్య నాదెళ్ల‌..షారుఖ్ ఇన్వెస్ట్

ఇద్ద‌రూ క‌లిసి స్టేడియంలో పెట్టుబ‌డి

Satya Nadella Shahrukh : యావ‌త్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంది క్రికెట్. సాక‌ర్ త‌ర్వాత క్రికెట్ కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంది. ఐటీ సెక్టార్ లో టాప్ లో కొన‌సాగుతున్న మైక్రోసాఫ్ట్ సిఇవో స‌త్య నాదెళ్ల‌తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh Khan ) క‌లిసి అమెరికాలో ఇన్వెస్ట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇద్ద‌రూ క‌లిసి స్టేడియం నిర్మాణంలో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు టాక్. ఇప్ప‌టికే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) జ‌ట్టుకు య‌జ‌మానిగా ఉన్నారు షారుక్ ఖాన్.

ఇదిలా ఉండ‌గా బాద్ షా క్రికెట్ లీగ్ కోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ స‌మీపంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో ఇన్వెస్ట్ చేశాడు. బాద్ షా త‌ర‌పున అనురాగ్ జైన్ పెరోట్ జైన్ మేనిజింగ్ పార్ట్ న‌ర్ గా ఉన్నాడు. ఇక డ‌ల్లాస్ లో ఈ ఏడాది ఏర్పాటైన టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు పెరోట్ జైన్ పార్ట్ ఓన‌ర్. భార‌త్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇస్తోంది.

యుఎస్ లో మేజ‌ర్ లీగ్ తొలి గేమ్ లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడ‌ర్స్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. మేజ‌ర్ లీగ్ క్రికెట్ అడోబ్ ఇంక్ సిఇఓ శాంత‌ను నారాయ‌ణ్ , మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ను , మ‌రికొంద‌రు సిఇవోల‌ను ఆక‌ర్షించింది. అది క్రికెట్ వైపు మ‌ళ్లేలా చేసింది. ఇదిలా ఉండగా ఇప్ప‌టికే క్రికెట్ లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్నాయి కంపెనీలు.

Also Read : Virat kohli : విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్

 

Leave A Reply

Your Email Id will not be published!