టీచర్లు ఛేంజ్ మేకర్లుగా తయారు కావాలి : లోకేష్

కలిసికట్టుగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధిద్దాం

అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోందని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇనస్తామని పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన 37మంది ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ అధ్యయన యాత్రలో తాము తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను వారు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఉపాధ్యాయులు సమాజంలో మార్పునకు నాయకత్వం వహించే లీడర్లని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంద‌ని చెప్పారు. అందుకోసమే తాను పట్టుదల, కమిట్ మెంట్ తో విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ మోడల్ విద్యా విధానం కోసం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన స్వర్ణాంధ్ర సాధనలో విద్యా శాఖ కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు నారా లోకేష్‌. క్వాంటమ్, ఏఐ వంటి అధునాతన సాంకేతికతలు అమలు చేయడం విద్యాశాఖ ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. తాను చిన్న వయసులోనే అమెరికా వెళ్లి స్టాన్ ఫోర్డ్ లో చ‌దువుకున్న‌ట్లు తెలిపారు. అక్కడ 100 దేశాల విద్యార్థులతో కలిసి ఐడియాస్, నాలెడ్జి, కల్చర్ పంచుకునే అవకాశం లభించిందని వెల్ల‌డించారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా ఛేంజ్ మేకర్స్ గా తయారు కావాలి. సింగపూర్ అధ్యయన యాత్రలో మీరు నేర్చుకున్న అంశాలను స్కూలు, క్లస్టర్, మండలాల్లో అమలు చేసేందుకు నాయకత్వం వహించాల‌ని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!