ముమ్మాటికీ పెనుకొండ నా జాగీరే : ఎస్. స‌విత‌

ఎన్నడూ లేనంత అభివృద్ధి చేస్తున్నాం

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముమ్మాటికీ పెనుకొండ నా జాగీరేన‌ని అన్నారు. వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లను కొట్టి పారేశారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని కూటమి ప్రభుత్వ హయాంలో నియోజక వర్గంలో చేస్తున్నానని చెప్పారు.పేదల వైద్య ఖర్చుల కోసం రూ.13.40 కోట్లకు పైగా అందజేశామ‌న్నారు… ఈరోజు రూ.కోటీ 15 లక్షల వరకూ అందజేసిన‌ట్లు తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణే నా ప్రథమ కర్తవ్యం అని మంత్రి ఎస్.సవిత తెలిపారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్దిదారులకు రూ.1.15 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందన్నారు. సర్జరీలు, అత్యవసర చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసానిస్తోందన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత పెనుకొండ నియోజక వర్గానికి చెందిన నిరుపేదలకు రూ.13.40 కోట్లకుపైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున నిధులు తరలొస్తున్నాయని మంత్రి సవిత వెల్లడించారు. గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరుగుతోందన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రాస్ కూటమి ప్రభుత్వమన్నారు. అన్నదాత సుఖీభవ, దీపం 2 కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!