చిత్తూరు జిల్లా : ప్రజల ఆశీస్సులే సీఎం చంద్రబాబు నాయుడుకు శ్రీరామ రక్ష అని అన్నారు నారా భువనేశ్వరి. కుప్పం మండలం సింగారపురంలో మహిళలతో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోందని అన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని, అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం నియోజకవర్గమే ఓ ప్రయోగశాల అని గుర్తు చేశారు. కుప్పానికి 17 పరిశ్రమలు రాబోతున్నాయని ప్రకటించారు. స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు నారా భువనేశ్వరి. కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చారని అన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. మహిళలు ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడాలని పిలుపునిచ్చారు. కుప్పం నియోకవర్గంలో ప్రతి గ్రామానికి సంక్షేమం అందేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పీ4 ద్వారా పేదలను ఆర్థికంగా పైకి తెస్తున్నారని చెప్పారు. సింగారపురం గ్రామానికి రూ. 23 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు వేయడం జరిగిందన్నారు. స్థానికంగా బ్రిడ్జ్ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నారా భువనేశ్వరి. గత పాలకులు రాష్ట్రాన్ని దోచేశారు. ప్రజలను ఇబ్బందలకు గురిచేశారని ఆరోపించారు. ఏపీ రాష్ట్రం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 20 గంటలకు పైగా నిద్రహారాలు ఆని శ్రమిస్తున్నారని చెప్పారు నారా భువనేశ్వరి. ఆయన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మీ కోసం పని చేస్తున్నారని తెలిపారు.
