హ‌త్యా రాజ‌కీయాల‌తోనే ఎదిగిన వైఎస్ కుటుంబం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి

అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై. ఆదివారం ఆయ‌న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. హ‌త్యా రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ జ‌గ‌న్ రెడ్డి కుటుంబం అని ధ్వ‌జ‌మెత్తారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు తమ రాజకీయ ఎదుగుదల‌లో ఎందరో అమాయకులు హత్య చేయబడ్డారని ధ్వజమెత్తారు. వైస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదని.. బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతీయులకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపించారు. వైఎస్ కుటుంబంలోని మూడు తరాల హత్య రాజకీయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.

వార్డు మెంబర్ స్థానానికి ఓడిపోయిన నీచ చరిత్ర వైఎస్ కుటుంబానిది అన్నారు. 1968 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్మ వైఎస్ జయమ్మ.. గాడిచర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిపై ఓడిపోయారు. 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీటర్ కేసు ఉంది. ఆ తర్వాత మంగంపేట బైరటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర చేరారు. పెట్టుబడి లేకుండా ఆయన తన వ్యాపారంలోకి రాజారెడ్డిని తీసుకున్నారు. అనంతరం కాలంలో ఆయన్ని హత్య చేశారు. ఆ హత్యా రాజకీయ పునాదిపై రాజారెడ్డి ఎదిగారు. ఆ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి అనుమానస్పాద మృతి చెందారు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళి రెడ్డిని హత్య చేశారు. ఆ హత్య జరిగిన తరువాతే కొళ్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడింది. 1989 చిన్నముడియం గ్రామంలో రిగ్గింగ్ చేయడానికి వెళ్లారు. ఆ గ్రామస్థులు రాజారెడ్డిని తీవ్రంగా అడ్డుకున్నారు. ఆ తరువాత శివారెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. శివారెడ్డి మరణం తర్వాతే వైఎస్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారని అన్నారు బీటెక్ ర‌వి.

శాంతి ప్రవచనాలు చెబుతున్న జగన్ రెడ్డి పేర్ల పార్థసారథి రెడ్డికి సమాధానం చెప్పాల‌న్నారు. పులివెందులల్లో అనేక హత్యలతో రాజారెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబందాలు ఉన్నాయి. రాజకీయాల్లో రాజారెడ్డికి వ్యతిరేకంగా పోటీచేసిన పేర్ల పార్థసారథి రెడ్డిపై హత్యాయత్నం చేశారు. కత్తులతో నరికారు అయినా ఆయన బతికి బట్ట కట్టారు. ఆ తర్వాత పార్థసారథి రెడ్డి వర్గీయులు రాజారెడ్డిని హత్య చేశారు. ఆ తర్వాత వాళ్ల సోదరుడు ఉమా రెడ్డి కూడా హత్య గావించబడ్డారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి మిగతా కొందరు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ తర్వాత అధికారం అడ్డం పెట్టుకొని పేర్ల పార్థసారథి రెడ్డి వర్గీయులను జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేశారు. వాళ్లను కోర్టులో పెట్టి కనీసం పెరోల్ రాకుండా చేసి కుటుంబాలకు దూరం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్లను ఏం చేయలేదని మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.

ఆ తర్వాత రాజారెడ్డి వారసుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు అన్ని ఇన్ని కావు. లింగాల మండలంలో పెద్ద గూడల కృష్ణారెడ్డిని హత్య చేయించారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న ముద్దాయిలను పోలీసు స్టేషన్ లో ఉంచి.. రాజశేఖర్ రెడ్డి అదే సమయంలో హైదరాబాద్ లో ఓ మిలటరీ అధికారితో గొడవపడ్డారు. ఎవరికి అనుమానం రాకుండా ఈ కేసు నుంచి తప్పించుకున్నారు. రిగ్గింగ్ చేసేందుకు డైనమైట్స్ పెట్టి లింగాల మండలంలో భయాందోళనలు సృష్టించారు. ఆ తరువాత రఘురామిరెడ్డిని హత్య చేశారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న విలేకరి నారాయణ, నంద్యాపల్లి శివరామిరెడ్డిని హత్య చేశారు. ఈ హత్యలతో పులివెందుల టౌన్ ను వైఎస్ కుటుంబానికి సరండర్ అయ్యింది అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!