న్యూఢిల్లీ : యుఎస్ కార్యదర్శి రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా అమెరికా, భారత్ దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో భారతదేశం ఒకటి అని నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రూబియో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధం సంప్రదాయ దౌత్య సంబంధాలకు అతీతంగా ఉందన్నారు. ప్రపంచ సవాళ్లపై లోతైన వ్యూహాత్మక ఏకీభావం ఉందని రూబియో అన్నారు. ఈ సందర్బంగా ఆయన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో భేటీ అయ్యారు. రోజు రోజుకు యుఎస్, ఇండియా మధ్య సంబంధం మరింత బలపడుతోందన్నారు.
ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధం సంప్రదాయ దౌత్య సంబంధాలకు అతీతంగా ఉందని, ప్రపంచ సవాళ్లపై లోతైన వ్యూహాత్మక ఏకీభావం ఉందని రూబియో అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే రెండు దేశాలుగా మీ ప్రయోజనాలు ఒకేలా ఉన్నప్పుడు, ఆ సమస్యలను పరిష్కరించడానికి మీరు వ్యూహాత్మకంగా కలిసి పనిచేయడం అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సహకారం విస్తృత పరిధిని హైలైట్ చేస్తూ రూబియో ఇలా అన్నారు. మేము భారతదేశంతో కలిసి పనిచేసే సమస్యల జాబితా వాటి పరిధి విస్తృతి, భారతదేశం యునైటెడ్ స్టేట్స్లో ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. ప్రపంచంలో మా అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకరని స్పష్టం చేస్తుందన్నారు రూబియో.