కోల్ కతా : స్వంత గడ్డపై పరువు పోగొట్టుకుంది అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ . జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. కేకేఆర్ కు చుక్కలు చూపించింది. దీంతో 40 పరుగుల భారీ తేడాతో ఓటమి చవి చూసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మరోసారి సత్తా చాటాడు కేఏల్ రాహుల్. తను 30 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 60 రన్స్ చేయడంతో గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీస్తే పేసర్ లుంగి ఎంగిడి కేవలం 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు.
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ లోకి చేరుకుంది. ఆ జట్టు కీలకమైన ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దర్జాగా 4వ స్థానంలోకి చేరుకుంది. టైటిల్ వేటలో నిలిచింది. ఇక టాస్ ఓడి పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. అభిషేక్ పోరేల్ 22 రన్స్ చేస్తే సాహిల్ పరాఖ్ 24 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఆఖరున 39 విలువైన పరుగులు జోడించడంతో భారీ స్కోర్ చేసింది ఢిల్లీ. అనంతరం ఆతిథ్య జట్టు కోల్ కతా 18.4 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 163 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అజింక్యా రహానే అద్బుతంగా ఆడాడు. తను 39 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్సర్లతో 63 రన్స్ చేశాడు. ఫిన్ అలెన్ 20, మనీష్ పాండే 24 చేశారు. ఒక దశలో 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులతో పటిష్టి స్థితిలో ఉన్న కోల్ కతాను బురిడీ కొట్టించాడు కుల్దీప్ యాదవ్.
