టిమ్స్ ఆస్పత్రిని అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలి
కీలక వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిమ్స్ ఆస్పత్రిని అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ లోని సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన మిగిలిన నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యతపై పూర్తి చేయాలన్నారు. దానిని ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఇవాళ ఆయన ఆకస్మికంగా టిమ్స్ ను తనిఖీ చేశారు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
గతంలో, గాంధీ , ఉస్మానియా జనరల్ ఆసుపత్రుల వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రజలకు ప్రధాన ఆసరాగా ఉండేవని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) ఉన్నత స్థాయి వైద్య సేవలను అందించేలా తాము టిమ్స్ ను రూపొందించడం జరిగిందని చెప్పారు కేటీఆర్. టిమ్స్ కోసం 22 ఎకరాల స్థలాన్ని వినియోగించినట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినట్లు ఆయన చెప్పారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే దీనిని యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్‌లో 2000 పడకల సామర్థ్యం గల మరో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని పేర్కొంటూ టిమ్స్ లో రూ. 1200 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులను నిర్మించినట్లు రామారావు తెలిపారు.
